తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. స్వాతి అనే 30 ఏళ్ల యువతిని.. ఆమె ప్రియుడే అత్యంత దారుణంగా చంపి.. ఆ తర్వాత 20 ముక్కలుగా నరికి.. ఓ గోనె సంచిలో ఉంచి.. దాన్ని పొలంలో పాతిపెట్టాడు. ఆలోచించటానికే అత్యంత భయంగా ఉన్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అసలు స్వాతిని ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏంటీ.. దీని వెనక ఏం జరిగింది అనేది వివరంగా తెలుసుకుందాం..
వీరభద్రం, స్వాతి ప్రేమికులు.... ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేస్తారు. ఈ క్రమంలోనే సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రత్నకుమార్, పార్వతి అనే భార్యభర్తల నుంచి 16 లక్షల రూపాయలు తీసుకున్నారు వీరభద్రం, స్వాతి. ..ఉద్యోగం ఇప్పిస్తామని 16 లక్షలు అయితే తీసుకున్నారు కానీ.. సింగరేణిలో ఉద్యోగం మాత్రం ఇప్పించలేదు వీరు.. ఈ క్రమంలోనే మా డబ్బులు మాకు ఇవ్వాలంటూ రత్నకుమార్, పార్వతి దంపతులు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు వీరు.
దీంతో తీవ్ర మనోదనకు గురైన పార్వతి, రత్నకుమార్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. 16 లక్షల రూపాయలు అప్పు చేసి కట్టాం అని.. ఇప్పుడు ఉద్యోగం లేక.. అప్పులు కట్టే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యతో వీరభద్రం, స్వాతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఆందోళనతో.. తీసుకున్న 16 లక్షల రూపాయలు తిరిగి ఇస్తానంటూ చెప్పింది స్వాతి.
అయితే ఉద్యోగం కోసం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వీరభద్రంపై ఒత్తిడి చేసింది స్వాతి. మన వల్ల ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అంటూ తీవ్ర మనో వేదనకు గురైన స్వాతి.. డబ్బుల విషయంలో వీరభద్రంతో గొడవ పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే స్వాతి అడ్డు తొలగించుకుంటే 16 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదనే ఉద్దేశంతోనే.. స్వాతిని .. ఆమె ప్రియుడు వీర భద్రం చంపేశాడు. మొదట కిడ్నాప్ చేసి.. ఆ తర్వాత చంపి.. అనంతరం స్వాతి డెడ్ బాడీని 20 ముక్కలుగా నరికి.. ఓ గోనెసంచిలో మూటగా కట్టి.. ఊరు చివర పొలంలో పాతిపెట్టాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. స్వాతి అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.